Plot:
వెంకీ ఎమ్మెల్యే అంజిరెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తుంటాడు. ఒక వివాహ సంబంధాల వేదిక ద్వారా వెంకీకి సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేసే హారికతో వివాహం అవుతుంది. బోరబండకు చెందిన వరుణ్ యాదవ్ కు హారిక చెల్లెలు హనీతో నిశ్చితార్థం అవుతుంది. పెళ్లి తర్వాత హారిక, ఆమె తల్లి చేసే పనుల వల్ల వెంకీకి నిరాశ పెరిగిపోతుంటుంది. వరుణ్‌ను కలిసిన తర్వాత వెంకీ పెళ్లి చేసుకోవద్దని సలహా ఇస్తాడు. కానీ వెంకీ మాటలను వరుణ్ పట్టించుకోడు. ఇంటి పక్కనుండే వ్యక్తి (గద్దె రాజేంద్ర ప్రసాద్) సలహాతో ముగ్గురు కలిసి యూరప్ విహార యాత్రకు వెళతారు. విషయం తెలుసుకున్న హారిక, హానీ కూడా యూరప్‌కి బయలుదేరుతారు. అందరూ దొరస్వామినాయుడు ఇంట్లో చేరుతారు.